రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ కోసం ఫ్యాన్స్ తెగ ఆందోళన చెందుతున్నారు. దానికి కారణం గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడా? అనే సందేహం అభిమానుల్లో రావడం. తాజాగా, రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ సందర్భంగా ప్రత్యర్థి వికెట్ కీపర్ సంజూ శాంసన్‌తో విరాట్ కోహ్లీ హార్ట్ బీట్ చెక్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.