ఆదిలాబాద్ లోని బీరాములు కాంప్లెక్స్ చెప్పుల షాప్ లో చోరీకి పాల్పడ్డ నిందితుడిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ తెలిపారు. ఎస్ఐ అశోక్ స్ధానిక పంజాబ్ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేసేప్పుడు అనుమానాస్పదంగా వెళుతున్న మహాలక్ష్మీవాడకు చెందిన రతన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడన్నారు. నిందితుడు దుకాణం షట్టర్ పగులగొట్టి 2వేలు చోరీ చేసినట్లు తెలిపారు.