అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ రాజు హెచ్చరించారు. ఆదిలాబాద్‌లోని కె. ఆర్. కె కాలనీలో కబ్జా చేసిన భూమిలో నయిం ఇంటిని నిర్మిస్తున్నాడు. బాధితులు కోర్టును ఆశ్రయించడంతో పనులను నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని కమిషనర్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు శనివారం పనులను ఆపివేసి ఇంటిని సీజ్ చేశామన్నారు. ఎస్ఐ విష్ణువర్ధన్, మున్సిపల్ టీపీఓ సుమలత తదితరులున్నారు.