బక్రీద్ నేపథ్యంలో పశువుల రవాణా చేసేవారు నిబంధనలు పాటించాలని డీఎస్పీ జీవన్ రెడ్డి సూచించారు. శనివారం ఆదిలాబాద్ వన్ టౌన్‌లో పశువులు అమ్మేవారితో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా పశువులను తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై యానిమల్ క్రూయల్టీ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.