పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య భద్రత కింద వైద్య సేవలు ఇకపై ఆదిలాబాద్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభిస్తున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. పోలీస్ సిబ్బందికి ఆరోగ్య భద్రత నగదురహిత చికిత్స సేవలను శనివారం పట్టణంలోని నక్షత్ర ఆస్పత్రిలో ఎస్పీ ప్రారంభించారు. ఈ మేరకు ఆస్పత్రి యజమానానికి పత్రాలను ఎస్పీ అందజేశారు. ఇకనుంచి స్థానికంగానే పోలీస్ సిబ్బంది ఉచిత చికిత్సలు పొందవచ్చన్నారు