తిర్యానిలో ఘనంగా ఆలయ వార్షికోత్సవం

56చూసినవారు
కొమురం భీం జిల్లా తిర్యాని మండలంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. రెండు రోజులపాటు శ్రీ వాసవి కన్యాకుమారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు సంఘం నాయకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమం, శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ, నిర్వాహకులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్