డా. బీఆర్ అంబేడ్కర్ ను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. భారత రాజ్యాంగం కోసం, ప్రజలు హక్కుల కోసం అంబేడ్కర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు.