తిర్యాణి మండలంలో పీఎం జుగా, పీఎం జన్మన్ పథకల పై కళాజాత ప్రదర్శనను శనివారం డిటిడిఓ రమదేవి ఆధ్వర్యంలో మండలంలోని దంతాన్ పల్లి, సుంగపూర్, లక్ష్మిపూర్, గ్రామాలలో కళాకారులచే ప్రజలకు అవగాహన కల్పించారు. దంతాన్ పల్లి గ్రామంలో గంగారం గుస్సాడి బృందంతో పథకాలపై అవగాహన కల్పించారు. సందర్భంగా డిటిడిఓ రమాదేవి మాట్లాడుతూ.. గిరిజనులకు వరంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు.