ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేస్లాపూర్ వీర హనుమాన్ ఆలయంలో శనివారం హనుమాన్ జయంతి నీ పురస్కరించుకొని భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు ఉదయం పూట ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు, ఎమ్మెల్యే కోవ లక్ష్మి తో కలసి హోమం, పూజ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దంపతులను శాలువాతో సన్మానించారు.