ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ బడీడు పిల్లలను అందరు బడికి పంపాలని, అలాగే సమాజంలో చదువుతూనే అందరికీ సమాన న్యాయం, సముచిత స్థానం దొరుకుతుందని అన్నారు.