ఆసిఫాబాద్: సిబిల్ స్కోర్ నిబంధన వెనక్కి తీసుకోవాలి: రాథోడ్ రమేష్

72చూసినవారు
ఆసిఫాబాద్: సిబిల్ స్కోర్ నిబంధన వెనక్కి తీసుకోవాలి: రాథోడ్ రమేష్
రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా అర్హులను ఎంపిక చేయడానికి సిబిల్ స్కోర్ ఆధారం చేసుకునే నిబంధన వెనక్కి తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ అన్నారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ నిబంధనతో మారుమూల గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుపేద యువకులు నష్టపోయే అవకాశం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్