రోగులకు అల్పాహారం పంపిణీ చేసిన ఆసిఫాబాద్ సివిల్ జడ్జి

65చూసినవారు
రోగులకు అల్పాహారం పంపిణీ చేసిన ఆసిఫాబాద్ సివిల్ జడ్జి
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఆసిఫాబాద్ జిల్లా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జక్కుల అనంత లక్ష్మీ నాగేంద్ర అల్పాహారం పంపిణి చేశారు. శుక్రవారం సివిల్ జడ్జి ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రోగులకు అల్పాహారం అందజేశారు. రోగులకు సరైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఉన్నారు.