రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ పనులను త్వరలో పూర్తి చేస్తామని పంచాయతీ కార్యదర్శి తిరుపతి పేర్కొన్నారు. బుధవారం ఆసిఫాబాద్ మండలంలోని చొర్పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమిపూజ చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుందని ఉప సర్పంచ్ నారాయణ అన్నారు.