జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా పంచాయతీ, మున్సిపల్, సంక్షేమం, జిల్లా పరిషత్, విద్య, వైద్య, గ్రామీణాభివృద్ధి, ఐసిడిఎస్ శాఖల అధికారులు, ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.