ఎంఎంహెల్ప్ లైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, దివంగత బీఆర్ఎస్ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ మహమూద్ 4వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఎంఎంహెల్ప్ లైన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధ్యక్షుడు ఎండీ అహ్మద్ మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మహమూద్ ఎంఎంహెల్ప్ లైన్ ఫౌండేషన్ స్థాపించారన్నారు.