కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ నియోజకవర్గంలో ఆదివారం సమాచార హక్కు రక్షణ చట్టం 2005 సొసైటీ జిల్లా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్, ఎంసిఆర్ హెచ్ఆర్డి ట్రైనర్ అష్రఫ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు.