ఆరుగాలం శ్రమించి పంట పండించిన దిగుబడి రాకపోవడంతో ఓ రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ మండలంలో చోటు చేసుకుంది. సిఐ రవీందర్ వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ మండలంలోని బొందగూడ గ్రామానికి చెందిన కొమ్రం పోషయ్య (55) తనకున్న పదేకరాల్లో పత్తి సాగు చేశారు. పత్తి పంట దిగుబడి రాకపోవడంతో నష్టం జరిగిందని సోమవారం మధ్యాహ్నం మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.