కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గురువారం దీక్ష భూమి వద్ద ఇటీవలే డాక్టరేట్ పొందిన సమాచార హక్కు రక్షణ చట్టం 2005 రాష్ట్ర ఉపాధ్యక్షులు కొండగుర్ల కమలాకర్ ను సమాచార హక్కు రక్షణ చట్టం సభ్యులు ఘనంగా శాలువాతో సన్మానించి, పూల బొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సొసైటీ డివిజన్ అధ్యక్షులు జాడి రవి దాస్, కార్యదర్శి నైతం కిరణ్ మాట్లాడుతూ సామాజిక రంగంలో గౌరవ డాక్టరేట్ పొందడం అభినందనీయమన్నారు.