కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ హక్కు పట్టాదారు చనిపోయిన వారిపై ఆధారపడ్డ వారసులకు విరాసత్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. వారి కుటుంబ సభ్యులు అటవీ హక్కు భూములను విరాసత్ చేసేందుకు ఎమ్మార్వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా ఛైర్మన్ రాథోడ్ రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.