కొమురం భీం జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని ఆదివాసీ భవనంలో ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ బెట్టి ఎలిజబెత్ దంపతుల 38వ వర్ధంతి ఆదివాసీలు శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హైమన్ డార్ఫ్ తన భార్య బెట్టి ఎలిజబెత్ తో కలిసి మూరుమూల గిరిజన గ్రామమైన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని పరిశోధనలు కొనసాగించాడన్నారు.