కొమురం భీం జిల్లా రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామ బీటీ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు చాపిడి పురుషోత్తం డిమాండ్ చేశారు. మంగళవారం గ్రామంలోని సమస్యలపై సర్వే నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామానికి రూ. 1. 40 కోట్లతో బీటీ రోడ్డు మంజూరైందన్నారు. కంకర పనులు పూర్తి చేసిన గుత్తేదారు బీటీ రోడ్డు వేయడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు.