ఆసిఫాబాద్ మండలం జనకాపూర్ ఆర్. ఆర్. కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కొమురంభీం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రే శనివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇండ్లను అందిస్తామని, నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. బేస్‌మెంట్ వరకు పూర్తయిన ఇండ్ల వివరాలను పోర్టల్‌లో నమోదు చేస్తే ప్రతి సోమవారం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు. లబ్ధిదారులు ఉచిత ఇసుకను వినియోగించుకోవాలన్నారు.