2వ ఏఎన్ఎం లకు ఇచ్చిన హామీలను అమలు చేయాడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయ్యిందని ఏఐటీయుసీ కొమరంభీం జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ ఆరోపించారు. గురువారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి అనంతరం డిఎంహెచ్ ఓ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ అంజుమ్ భానుకు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈనెల 17నుంచి జరిగే నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.