ఆసిఫాబాద్‌‌: మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

0చూసినవారు
ఆసిఫాబాద్‌‌: మహిళా శక్తి భవన్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
కొమురంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లాలో ‌మహిళా శక్తి భవన్ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శనివారం పంచాయతీరాజ్ ఈఈ అజ్మీర కృష్ణతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్, మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రూ. 5 కోట్ల నిధులతో చేపట్టిన ఈ పనులను అక్టోబర్ చివరివారంలోగా పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్