మకర సంక్రాంతి పండుగను పురస్కరించుకుని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని అన్ని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 11 నుంచి 15 వరకు క్రయవిక్రయాలు జరగవన్నారు. రైతులు గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.