విద్యార్థుల సృజనాత్మకతను ఉపాధ్యాయులు గుర్తించి వారు ఏ రంగాలలో రాణిస్తారో.. ఆయా రంగాల అభివృద్ధికి మార్గదర్శకత్వం కావాలని కొమరంభీం జిల్లా విద్యాశాధికారి యాదయ్య అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న జిల్లా స్థాయి ఇన్స్ఫర్ మాక్ 52 బాలల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భవిష్యత్ లో విద్యార్థులు మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు.