వాంకిడి సిహెచ్సి ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం వాంకిడి హాస్పిటల్ డాక్టర్ వినయ్ కుమార్ కి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.