బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలని కొమురంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ భవనంలో ఫూలే జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే కోవలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. అనంతరం ఫూలే చిత్రపటానికి పూలు చల్లి నివాళి అర్పించారు. మహనీయులు చూపిన బాటలో అందరూ నడవాలని సూచించారు.