కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ లోని డిటీఓ కార్యాలయంలో జిల్లా వాహన అధికారి రాంచందర్ ఆధ్వర్యంలో గురువారం జిల్లాలోని పాఠశాలల బస్సు డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. బస్సులకు పాఠశాలలు ప్రారంభం కాకముందే ఫిట్నెస్ పరీక్షలు చేయించాలని, డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమం లో ప్రైవేట్ పాఠశాలల యజమానులు, డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.