వాంకిడిలో గుట్కా స్వాధీనం, ఒకరిపై కేసు నమోదు

50చూసినవారు
వాంకిడిలో గుట్కా స్వాధీనం, ఒకరిపై కేసు నమోదు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని నూర్ కిరాణ గోదాంలో బుధవారం రాత్రి గుట్కా పట్టుకున్నట్లు వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు తనిఖీ చేయగా రూ. 12, 573 విలువైన గుట్కా లభ్యమైనట్లు చెప్పారు. తెలంగాణలో గుట్కా నిషేధించబడిందని, అక్రమ నిలువలు ఉంచినా లేదా అమ్మినా అట్టి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్