

భూమన చేసిన ఆరోపణలు అబద్ధం: టీటీడీ బోర్డు సభ్యుడు (వీడియో)
AP: ఎస్వీ గోశాల గోవధ శాలగా మారిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి స్పందించారు. భూమన చేసిన ఆరోపణలు నిజం అని నిరూపించాలని సవాల్ విసిరారు. టైం చెబితే తానే గోశాలకు వస్తానని, గోవులు చనిపోయినట్లు నిరూపించాలన్నారు. ఒకవేళ నిరూపించకపోతే భూమన రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని అడిగారు.