
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 5న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. 1.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక, ఈ నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ నెలకొంది.