ఆసిఫాబాద్ నియోజక వర్గం రెబ్బెన మండల కేంద్రం బస్టాండ్ వద్ద శనివారం బారాస ఏంఎల్ఏ దిష్టి బొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా కొమురంభీం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు మాట్లాడుతూ, రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అమలు చెస్తే మింగుడు పడని కేటీఆర్ బాధ్యత గల పదవిలో కొనసాగుతూ ఇలా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గు చేటు అన్నారు.