ఆసిఫాబాద్ మండల పరిధిలోని చిర్రకుంట గ్రామ శివారులో సోమవారం అక్రమంగా నిల్వ చేసిన ఇసుక డంప్ ను సోమవారం సీఐ రవీందర్ పోలీస్ సిబ్బందితో కలసి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి చూడగా, గ్రామ శివారులో ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన సుమారు 100 ట్రిప్పుల ఇసుక డంప్ ను గుర్తించారు. పట్టుకున్న ఇసుక డంప్ ను తహశీల్దార్ కు అప్పగించడం జరిగిందని తెలిపారు.