ఆసిఫాబాద్ జిల్లాలో షెడ్యూల్డ్ కులాల న్యాయశాస్త్ర పట్టభద్రులు శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి సజీవన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల పాటు న్యాయ పరిపాలనలో శిక్షణ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. శిక్షణ సమయంలో ప్రతి నెలా రూ. మూడు వేల భృతి ఇస్తామన్నారు. ఇతర వివరాలకు సెల్ నం. 6281510601 లో సంప్రదించాలని సూచించారు.