ఓ ఇంట్లో రవాణాకు సిద్ధంగా అక్రమంగా నిల్వ ఉంచిన గంజాయిని జైనూర్ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలసి గురువారం సాయంత్రం పట్టుకున్నారు. జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. జైనూరు మండలం పోచంలోద్ది గ్రామంలోని షేక్ ఖయ్యుమ్ ఇంట్లో గంజాయి నిల్వ ఉందన్న విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. 1 కేజీల 400 గ్రాముల గంజాయిని స్వాధీన పరచుకొని, షేక్ ఖయ్యూమ్ ను అదుపులోకి తీసుకున్నారు.