కెరమెరి మండలంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆసుపత్రిలో రెగ్యులర్ వైద్యుడు లేక ప్రజారోగ్యం పడకేసింది. ఇద్దరు ముగ్గురు సిబ్బంది ఉన్నా సమయపాలన పాటించకుండా విధుల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ఆరోపించారు. మంగళవారం DMHO సీతారాంను కలిసి నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఆసుపత్రిలో సిబ్బందిని నియమించాలని విజ్ఞప్తి చేశారు.