కాగజ్ నగర్ మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మీ శుక్రవారం ఉదయం పత్తి ఏరడానికి నజ్జునగర్ వెళ్ళగా అక్కడ పులి దాడి చేయడంతో లక్ష్మీ అక్కడికక్కడే మరణించింది. జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఇది కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పులి దాడులు జరుగుతున్నాయని డిఎఫ్ఓ వెంటనే వచ్చి మృతురాలి కుటుంబానికి రూ. 20 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఫారెస్ట్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు.