

లాస్ ఏంజల్స్‌లో గడ్డు పరిస్థితులు వస్తాయి: ట్రంప్ (VIDEO)
జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కేలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్తో తన ఫోన్ సంభాషణను వివరించారు. "మేము 16 నిమిషాల పాటు మాట్లాడాం. అతని చర్యలు సరిచేసుకోవాల్సిందేనని చెప్పాను, లేదంటే లాస్ ఏంజల్స్‌లో గడ్డు పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించాను. సంభాషణ కూల్‌గా సాగింది" అని ట్రంప్ తెలిపారు. కాగా, లాస్ ఏంజెలెస్‌లో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.