ఆసిఫాబాద్: పోలీసులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్

76చూసినవారు
పోలీసులపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్ అయ్యారు. ఆదివారం రాత్రి ఆసిఫాబాద్ మండలం గుండి బైపాస్ వద్ద పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. ఈ టెస్ట్ లలో మద్యం తాగి ఉన్న పలువురు వాహనదారులను పట్టుకుని వారికి జరిమానా విధించి వాహనాలు సీజ్ చేశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారు ఆపి వైన్స్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఏంటని, వాహనాలను తిరిగి ఇవ్వాలని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్