కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ పట్టణంలోని భువమ్మ తల్లి దేవస్థానంలో ఆదివారం మొహరం ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులు అన్న ప్రసాదం స్వీకరించారు. ఈనెల 16 న పెద్ద సరిగేతు కార్యక్రమం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.