నార్నూర్ మండల కేంద్రంలోని నాగల్కొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు జాదవ్ సునీత నారాయణ్ ఆదివారం పదవి విరమణ పొందారు. దీంతో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆమెను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిఒక్కరి ఎదుగుదల వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో చారులత, సురేష్ ఆడే, కళావతి, నరేందర్, జయవంత్ రావు పాల్గొన్నారు.