నార్నూరు మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జరిగిన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ దీక్ష భూమి జాతర మహోత్సవ కార్యక్రమంలో శనివారం ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఏడాది ఎంతో భక్తిశ్రద్ధలతో బంజార సోదరులు ఈ జాతరను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.