బెజ్జూర్, పెంచికల్ పేట్ పోలీస్ స్టేషన్లకు కొత్త ఎస్ఐలుగా నియామకాలు శనివారం జరిగాయి. ఆసిఫాబాద్‌లోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్‌ను బెజ్జూర్ ఎస్ఐగా నియమితుడైన ఎండి. సర్టాజ్ పాషా, పెంచికల్ పేట్ ఎస్ఐగా నియమితుడైన అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ ఇద్దరికి శుభాకాంక్షలు తెలిపారు.