కేరమేరి మండలం అనార్పల్లి, లక్మాపూర్ వాగులపై పెండింగ్లో ఉన్న వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరుతూ గురువారం కొమురంభీం జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రేకు జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ పిఆర్ అధికారులతో మాట్లాడి వంతెన పనుల ఆలస్యంపై సంబంధిత గుత్తేదారుకు వివరణ అడగాలని పనులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు ఇచ్చారు.