ఆసిఫాబాద్: పత్తి వ్యాన్ బోల్తా

77చూసినవారు
ఆసిఫాబాద్: పత్తి వ్యాన్ బోల్తా
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్లోని సాయిబాబా ఆలయం సమీపంలో పత్తి లోడుతో వెళ్తున్న వ్యాన్ మంగళవారం అదుపుతప్పి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యంతో వ్యాన్ బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహన చోదకులు ఎవరూ రోడ్డుపై లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

సంబంధిత పోస్ట్