ఎనిమిది లక్షల విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం

66చూసినవారు
ఎనిమిది లక్షల విలువ గల నిషేధిత గుట్కా స్వాధీనం
ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారన్న ‌పక్కా సమాచారం మేరకు మంగళవారం ఆసిఫాబాద్ పట్టణంలోని ఫోరెస్ట్ చెక్ పోస్టు వెనుకాల గల గోదాంలో ప్రభుత్వ నిషేధిత గుట్కా నిల్వలను పట్టుకోవడం జరిగింది. మహరాష్ట్ర చంద్రాపూర్ కు చెందిన అమిత్ గోదంగా గుర్తించారు. అందాజ రూ. 8 లక్షల గుట్కా పట్టుకొని ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణాప్రతాప్ తెలిపారు. ఈ టాస్క్ లో ఎస్ఐ. గంగాన్న, పీసీలు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :