రెబ్బెన మండలంలోని రాంపూర్ గ్రామంలో గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతిని పురస్కరించుకొని పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షురాలు చాపిడి శ్రావణి మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అక్షర జ్యోతి వెలిగించిన సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిబాపూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు చల్లూరి క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు.