కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు ఏఎస్పీ ప్రభాకర్ రావును గురువారం వారి కార్యాలయంలో జాతీయ మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న నకిలీ విత్తనాల బెడదను ప్రత్యేక బృందాలను నియమించి అరికట్టాలని, గంజాయి సరఫరాపై ఉక్కు పాదం మోపాలని వినతి పత్రం అందజేశారు. నైతం మోహన్, నైతం భానుచందర్, చౌరే మహేష్, కొండ శశాంక్ తదితరులు పాల్గొన్నారు.