కాగజ్ నగర్ మండలం కొత్త సార్సాల గ్రామ పంచాయతీలో గల సార్సాల గ్రామంలో వెలసిన ముత్యాల పోచమ్మ గుడి వద్ద సంతోష్ శర్మ అయ్యగారిచే గురువారం ఉదయం 10: 00 గంటలకు అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాగజ్ నగర్ మండల బీజేపీ అధ్యక్షులు పుల్ల అశోక్ తో పాటు పూదరి వెంకయ్య, పూదరి సత్తయ్య, బొడ్డు పోచయ్య, కొట్టె సాంబయ్య, పుల్ల మల్లేష్ దంపతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.